సుప్రీం కోర్టు తీర్పుతో అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంద కృష్ణమాదిగ

by Mahesh |
సుప్రీం కోర్టు తీర్పుతో అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంద కృష్ణమాదిగ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన దర్మాసనంలో 6:1 మెజారిటీతో తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని, వర్గీకరణ చేసే వీలు రాష్ట్రాలకు ఉంటుందని తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణ మాదిగ భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు ముందు మీడియా ఎదుట ఆయన కంట నీరు పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని చొరవ తీసుకున్న కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి, వెంకయ్యనాయుడులకు ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. ఆయన పోరాటంతో సుప్రీం కోర్టు తీర్పు కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్ రెడితో కలిసి స్వీట్లు పంచుకున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల వేదికగా సూప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు. అలాగే అవసరమైతే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి నోటిఫికేషన్లలో కొత్త రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story