- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ సర్కార్‌కు మందకృష్ణ మాదిగ అల్టిమేటం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 11వ తేదీలోపు రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో కలిసి ఉద్యమం చేస్తామని అన్నారు. కులగణన పేరుతో కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎవరూ ఆనందంగా లేరని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. కనీసం రైతుల గురించి పట్టించుకునే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తోన్న ద్రోహానికి నిరసనగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం. తాము ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు.