Manda Krishna: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. మంద కృష్ణ మాదిగ భావోద్వేగం

by Shiva |   ( Updated:2024-08-01 06:30:28.0  )
Manda Krishna: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. మంద కృష్ణ మాదిగ భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తప్పనిసరి అని, ఆ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వెలువడి తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ట మాదిగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీం కోర్టు ఆవరణలో మాట్లాడుతూ.. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటానికి తగిన ఫలితం దక్కిందన్నారు. ఈ పోరాటంలో చాలా మంది అసువులు బాశారని.. వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, మొక్కవోని ధైర్యంతో ఏమాత్రం సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించమని అన్నారు. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలబడిన వారందరికీ ఈ విజయం అంకితమని మంద కృష్ణ మాదిగ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed