BJP స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో భేటీపై మంద కృష్ణ మాదిగ క్లారిటీ

by Satheesh |   ( Updated:2023-07-26 14:42:25.0  )
BJP స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో భేటీపై మంద కృష్ణ మాదిగ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి మందకృష్ణ బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన కిషన్ రెడ్డిని అభినందించేందుకు మాత్రమే తాను పార్టీ కార్యాలయానికి వచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు.

అందుకే అందుబాటులో ఉన్న పలు ఎస్సీ సంఘాల నేతలతో కిషన్ రెడ్డిని కలిసినట్లుగా చెప్పారు. తమది రెండున్నర దశాబ్ధాల అనుబంధమని ఆయన చెప్పారు. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. కాగా మందకృష్ణతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కిషన్ రెడ్డిని కలిశారు.

Advertisement

Next Story