Minister Komati Reddy : మూడేళ్ళలో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం కావాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
Minister Komati Reddy : మూడేళ్ళలో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం కావాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మూడేళ్ళలో మామునూర్(Mamunur Airport) ఎయిర్ పోర్టు నిర్మాణం కావాలని రోడ్లు, భవనాలు, ఎయిర్ పోర్టుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో మామునూర్ ఎయిర్ పోర్ట్ పై ఉన్నతాధికారులతో వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక ఏర్పాట్ల కంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. త్వరితగతిన భూసేకరణ పూర్తిచేసి మూడేండ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవలన్నారు. ప్రతీ పదిహేను రోజులకోసారి పనుల పురోగతిపై రివ్యూ చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలాగా హామీలతో కాలం వెళ్లబుచ్చితే అర్ధం లేదని, విమానాశ్రయం నిర్మించి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టిపెట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులకు మంత్రి వెంకట్ రెడ్డి సూచించారు.

వరంగల్ ఎయిర్ పోర్ట్ ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనుకూలంగా మార్చాలని పేర్కొన్నారు. యునెస్కో సైట్ రామప్ప, భద్రకాళీ, వెయ్యి స్తంభాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్ అవసరాలు, భవిష్యత్ పరిశ్రమలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దాలని అధికారులకు మార్గదర్శకం చేశారు. త్వరలోనే తాను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి స్వయంగా మామునూర్ వచ్చి ఎయిర్ పోర్ట్ స్థితిగతులపై పరిశీలిస్తానని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎవియేషన్ డైరెక్టర్ భారత్ రెడ్డి, ఆర్ ఆండ్ బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story