మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్.. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం

by Rajesh |
మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్.. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
X

దిశ, కోనరావుపేట: కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ - 9 లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. మంత్రి శ్రీ కే తారకరామారావు ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ ను చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం సరిగ్గా 07.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు.ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎత్తి పోతల సలహాదారు పెంటా రెడ్డి, mrkr,wpl ఏజెన్సీల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రయల్ రన్ ఎప్పటి కప్పుడు ట్రయల్ రన్ పై అధికారులను ఆరాతీస్తూ సజావుగా జరిగేలా మార్గనిర్దేశం చేశారు. ప్యాకేజీ -9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలు చూసారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూముల సస్యశ్యామలం కానున్నాయి. రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌‌ను త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed