- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ALERT: ‘దిశ’ పై విష ప్రచారం.. పేపర్ పేరుతో ఫేక్ క్లిప్పింగ్స్.. పాఠకులు అప్రమత్తంగా ఉండాలి
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన పత్రికలకు ధీటుగా డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న ‘దిశ’పై కొందరు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. దిశ డిజిటల్ పేపర్‌లో వచ్చిన విధంగా పేపర్ క్లిప్పింగ్‌లను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా రోజు రోజుకు దిశ డిజిటల్ పేపర్‌లో వచ్చిన వార్తలా.. క్లిప్పింగ్స్ ఫేక్ మార్ఫింగ్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. అచ్చం దిశ ఎడిషన్‌లో వచ్చినట్లుగానే మార్పులు చేసి..ఫేక్ క్లిప్పింగ్స్ క్రియేట్ చేస్తున్నారు.ఇటీవల ఏపీలో జనసేన, టీడీపీ అభ్యర్థుల ప్రకటన సమయంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు పోయినట్లే అంటూ ఓ ఫేక్ క్లిప్పింగ్ క్రియేట్ చేశారు. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి విషయంలో కూడా ఫేక్ క్లిప్పింగ్ సృష్టించారు. తాజాగా మరో ఫేక్ క్లిప్పింగ్ సర్క్యూలేట్ అవుతుంది.
ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో దారుణం.. రామాలయంలోకి వచ్చారని దళితులపై దాడి అని దిశ పేపర్ పేరుతో ఫేక్ క్లిప్పింగ్ సృష్టించారు. ఈ ఫేక్ క్లిప్పింగ్స్ పై దిశ యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఇదంతా దిశ ఎదుగుదలను చూసి ఓర్వలేని శక్తులే ఇలాంటి దుష్ట ప్రయత్నాలు చేస్తున్నాయని దిశ యాజమాన్యం ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండించింది. దిశ వెలువరిస్తున్న కథనాలకు ప్రజల్లో విశ్వసనీయత ఉండటం వల్లే దిశలో వచ్చిన కథనాలనాలైతే ప్రజలు నమ్ముతారనే కొంత మంది ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వాటిపై పాఠకులు అప్రమత్తంగా ఉండాలని దిశ యాజమాన్యం కోరుతోంది. ఫేక్ క్లిప్పింగులతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరించింది.