- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహాలక్ష్మి గ్యాస్ వినియోగం హైప్.. 21 లక్షల సిలిండర్ల రీఫిల్లింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.500లకే సిలిండర్ అందిస్తున్నారు. మూడు నెలల్లోనే సిలిండర్ల వినియోగం పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పథకానికి పథకం అమలు తేదీ నుంచి ఇప్పటి వరకు 39,33,615 మంది అర్హత పొందినట్టు అధికారులు తెలిపారు. 18,86,045 మంది సిలిండర్ల రీఫిల్ కోసం బుకింగ్స్ చేసుకున్నారు. ఇప్పటివరకు 21,29,460 సిలిండర్లను అర్హులైన లబ్ధిదారులు తీసుకున్నారు. పథకం అమలు తేదీ నుంచి గడిచిన మూడు నెలలుగా రీఫిల్ వినియోగంపై ఒక క్లారిటీ రావడంతో పౌర సరఫరాల శాఖ ఒక అంచనాకు వచ్చింది. రాష్ర్ట ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం రూ. 59.97 కోట్ల సబ్సిడీని క్లెయిమ్ చేసింది.
1.20 కోట్ల కనెక్షన్లు
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు. ఈ కుటుంబాలు మూడేళ్ల కాలంలో వినియోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకొని గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని లెక్కగట్టిందని సమాచారం. మొత్తం 1.20 కోట్ల కనెక్షన్లు ఉండగా.. అందులో 44 శాతం మంది ప్రతి నెలా ఒక సిలిండర్ వాడుతున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు ఇదివరకే గుర్తించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మహాలక్ష్మి పథకం మొదటి త్రైమాసిక కిస్తీ కింద పౌర సరఫరాల శాఖకు రూ.60 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.