- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారాయణపేట ఎస్పీగా యోగేష్ గౌతమ్
దిశ, నారాయణపేట క్రైమ్: అసెంబ్లీ ఎన్నికలు సమర్థవంతంగా పూర్తి కావాలంటే రెవెన్యూ యంత్రాంగం తో పాటు పోలీస్ శాఖ కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. జిల్లా పోలీస్ శాఖ కీలకంగా పని చేయాలంటే జిల్లా పోలీస్ బాస్ పనితీరు, కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నారాయణపేట జిల్లా ఏర్పాటు అనంతరం జిల్లా రెండవ ఎస్పీగా పని చేసిన చేతన ఐపీఎస్ క్యాడర్ నుంచి జిల్లాకు కేటాయించబడి సుదీర్ఘకాలం తర్వాత బదిలీ అయి వెళ్లారు. ఆమె ఇక్కడ పనిచేసిన సమయంలో కొన్ని విషయాల్లో( రాజకీయ నాయకుల ఒత్తిళ్లు) నిష్పక్షపాతంగా ఉండేది.
ఆ తర్వాత ఎస్పీ వెంకటేశ్వర్లు కిందిస్థాయి నుంచి పదోన్నతి ద్వారా నారాయణపేట జిల్లా ఎస్పీగా వెంకటేశ్వర్లు పని చేశారు. ఈ మధ్యనే వెంకటేశ్వర్లు బదిలీ కాగా ఆయన స్థానంలో 2018 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన యోగేష్ గౌతమ్ ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇదిలా ఉండగా పదోన్నతి ద్వారా కాకుండా డైరెక్ట్ ఐపీఎస్ కేడర్ కు చెందిన పోలీస్ అధికారి కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు సమాజానికి మేలవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.