మహిళా శక్తి పథకం లక్ష్యాలను అందుకోవాలిః కలెక్టర్ సంతోష్

by Nagam Mallesh |
మహిళా శక్తి పథకం లక్ష్యాలను అందుకోవాలిః కలెక్టర్ సంతోష్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : మహిళా శక్తి పథకం లక్ష్యాలను అందుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబందిత అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శక్తి పనుల పురోగతిపై బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని అన్ని మండలాల్లో కార్యచరణ ప్రకారం లక్ష్యాలను సాధించేలా అధికారుల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. ఇంకా పూర్తి చేయవలసిన పనులు ఏవీ అన్న విషయాలను అడిగి, వీటి అమలులో ఉండవలసిన జాగ్రత్తలను సూచించారు. అన్ని మండలాల్లో లక్ష్యాలకు అనుగుణంగా మహిళా శక్తీ పథకాల అమలుకు సంబంధించి యూనిట్ల ఏర్పాటు, బ్యాంకు రుణాల సమీకరణ , నెలవారీ ప్రణాళిక సిద్దం చేయాలనీ, మండలం వారీగా సాధించిన పురోగతి, అన్ని వివరాలు ఖచ్చితంగా ఉండాలని అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనను సాధించడంలో ఏపీఎంలు, డీపీఎంలు పూర్తి బాధ్యతతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. అమలు విషయంలో ఏ విధమైన లోపం లేకుండా, సమర్థవంతంగా పని చేయాలని, తద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మరియు డి ఆర్ డి ఓ నర్సింగ రావు, ఎల్ డి ఎం అయ్యపు రెడ్డి, అడిషనల్ డిఆర్డిఓ నరసింహులు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు విలాస్ రావు, రామ్మూర్తి, ఏపీఎం లు, డిపిఎం లు, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed