గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి

by S Gopi |
గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి
X

దిశ, గద్వాల క్రైమ్: వంట చేస్తూ గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ మృతిచెందిన సంఘటన ఆదివారం గద్వాల మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కోడుముక్కు చిన్న రామన్న- ఆయన భార్య కోడి ముక్కు కిష్టమ్మ (65) గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఆదివారం మ. 12 గంటల సమయంలో వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో కిష్టమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. ఇంట్లో ఉన్న చిన్న రామన్నకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ పేలుడు శబ్దం రావడంతో గ్రామస్తులంతా ఆ ఇంటి వద్దకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గద్వాల రూరల్ ఎస్సై ఆనందం పోలీస్ సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. జరిగిన సంఘటనపై గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Next Story