- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలం - ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట ప్రాంతానికి సాగునీరు అందించే అచ్చంపేట ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఫైలాన్ ను జిబిఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి గువ్వల అమలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపనకు మంత్రి కేటీఆర్ అచ్చంపేటకు రప్పించి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలనే తన కోరిక ఒకరకంగా నెరవేరక పోయినప్పటికీ నేనే శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఈ అదృష్టం అందరికీ దక్కదు..
ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నానంటే నిజంగా చాలా తక్కువ మందికి అదృష్టం దక్కుతుందని ఆ అదృష్టం నాకు రావడం గొప్ప సంకేతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కష్టపడి సాధించినటువంటి ఈ ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వమే తెలియపరిచిందని, ఇది ఎమ్మెల్యే కృషివల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని ప్రభుత్వం తెలిపినట్లు వివరించారు. ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలని సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి శైలజ విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.