- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC పట్నం మహేందర్ రెడ్డి BRSకు గుడ్ బై చెప్పనున్నారా?
దిశ, తాండూరు రూరల్ : మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి , నాగర్ కర్నూల్ జిల్లాకు ఇన్‌చార్జి వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్‌లో ఉంటూ అధిష్టానం పై తిరగబడే నిర్ణయాన్ని బలపర్చడం వెనుక పార్టీని వీడే ఉద్దేశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నారా..? అంటే అవుననే అనిపిస్తుంది ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే.
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న నివాసంలో ఆదివారం ముఖ్య నేతలు సమావేశం వెనుక ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హస్తం ఉందని రాజకీయ విశ్లేషకుల వాదలు వినిపిస్తున్నాయి. 30 ఏండ్ల నుంచి మహేందర్ రెడ్డి వెనుక ఉన్న ముఖ్య నేత కరణం పురుషోత్తం రావుతో అధికార పార్టీలో ఉన్న తమ మాట ఏ అధికారులు వినడం లేదని పలువురు నేతలు సూచించారు. దీంతో తమ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నామని వివరించినట్లు సమాచారం.
తాండూరు నియోజకవర్గంలో అప్పటికే హవా సాగిస్తున్న బీఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. అప్పటి నుంచి ఆధిపత్య పోరు మొదలైంది.బీఆర్ఎస్ వీడాలన్న ఆలోచనతోనే నేతల ఈ వ్యాఖ్యలు చేసినట్లు జనాలు ముచ్చటిస్తున్నారు.ఇప్పటికే ఎమ్మెల్సీలు కొంతమంది ముఖ్య నేతలతో మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు.ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో తాండూరు నుండి పోటీ చేయడం ఖాయమని అనుచరులు సైతం అంటున్నారు. దీంతో ఆయన పార్టీ మార్పు తథ్యమని ఫిక్స్ చేసేస్తున్నారు జనాలు.