ఆ ఘటనకు బాధ్యులు ఎవరు ?.. బలైంది ఎవరు ?

by Sumithra |
ఆ ఘటనకు బాధ్యులు ఎవరు ?.. బలైంది ఎవరు ?
X

దిశ, అచ్చంపేట : ఈనెల 26న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రికి ప్రసవం కోసం పదరా మండల కేంద్రానికి చెందిన మంజుల ఆసుపత్రికి చేరుకుంది. కాగా ఆ గర్భిణీ నరకయాతన చూపి ఆలస్యంగా కాన్పు చేయడంతో ఆ తల్లికి జన్మదిన బిడ్డ మృతి చెందిన సంఘట దిశ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం విదితమే...ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాల మేరకు.. తక్షణమే డిప్యూటీ కమిషనర్ జయరాం రెడ్డి గత నెల 27న అచ్చంపేట ఆసుపత్రిలో విచారణ చేపట్టారు.

విచారణ చేపట్టిన రెండు రోజులు అనంతరం వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాల మేరకు ఐదు మంది ఉద్యోగుల పై వేటు వేశామని వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ అచ్చంపేట ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ రమేష్ చంద్ర మీడియాకు విడుదల చేశారు. అందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగి బాల్ లింగమను పూర్తిగా విధుల నుంచి తొలగిస్తూ.. స్టాఫ్ నర్స్ సరోజ, కురువమ్మ స్వీపర్ను సస్పెండ్ చేస్తున్నామని, సూపర్డెంట్ డాక్టర్ కృష, స్త్రీల వైద్య నిపుణులు స్రవంతి, మరో స్టాప్ నర్స్ జయమ్మ షోకాజు నోటీసులు జారీ చేస్తున్నామని మీడియాకు ప్రకటించిన విషయం విదితమే.

దిశ ముందుగానే చెప్పింది..!

పై సంఘటనపై అసలు బాధ్యులను వదిలిపెట్టి ఇతరులను, అమాయకులను బలి చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన బాధ్యులను ప్రకటించడంలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ మల్లగుల్లాలు పడటంలో ఆంతర్యం ఏమిటని దిశ పత్రిక మరో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దిశ చెప్పిన్నట్టుగానే.. అసలు ఆ సంఘటనకు బాధ్యులు ఎవరు ? బలయింది ఎవరనేదీ ? అటు ఆసుపత్రి వర్గాలలో, స్థానిక ప్రజలలో చర్చ జరుగుతుంది. విచారణకు వచ్చిన అధికారి అసలు దోషులను వదిలిపెట్టి అమాయకులను బలి చేసేలా తన నివేదిక సమర్పించడం వలన ఈ తతంగం జరిగిందని అధికారులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంఘటనను సల్లపరిచేలా తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గత నెల 28న జారీ చేశారు. మీడియాకు వెల్లడించిన ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులలో డిప్యూటీ కమిషనర్ ప్రకటించిన విధంగా కాకుండా.. ఆ సంఘటనకు ఇలాంటి సంబంధం లేనటువంటి నామాల కురువమ్మను సస్పెన్షన్ చేశామని చెప్పి, విధులకు రానివ్వకుండా ఏప్రిల్ 2న సస్పెన్షన్ ఆర్డర్ కాపీని అందజేసినట్లు తెలిసింది. ఔట్సోర్సింగ్ బాలింగమ్మను విధుల నుంచి తొలగించి, నామాల కురువ్వమ్మ సస్పెన్షన్ చేస్తూ మిగతా ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంలో విచారణ చేసిన అధికారులకు తగదని అభిప్రాయపడుతున్నారు.

ప్రజాసంఘాల ఆగ్రహం..

సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా అమాయకులను బలిచేయడం తప్పిదమని ఆరోపిస్తూ, పై సంఘటన తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ కార్యాలయం చేపట్టిన చర్యలు ముమ్మాటికి తప్పదమేనని జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి లక్ష్మీనారాయణ, ప్రజాఫ్రంట్ కార్యవర్గ సభ్యులు అంబయ్య, నిర్వాసితుల ఫోరం జిల్లా సభ్యులు అనిల్ తదితరులు బుధవారం న్యాయవిచారణ చేయగా అలాగే గురువారం పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సంఘటనకు సంబంధించిన అసలు కారకులైన వారిని వదిలిపెట్టి అమాయకులను బలిచేయడం తగదని విమర్శించారు.

Advertisement

Next Story