- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవిస్తాం: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
దిశ, ప్రతినిధి వనపర్తి: అన్ని మతాల సాంప్రదాయాలను, పండుగలను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన సంస్కృతి సంప్రదాయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
అందులో భాగంగానే ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా తోఫాలు అందించడం, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం అలాగే ప్రతి మతానికి సంబంధించిన పండగల సమయంలో వారికి ఆయా విధంగా సముచితంగా బహుమతులు అందించడం చేస్తున్నారని ఆయన అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో కులమతాలకతీతంగా అందరూ కలిసి పండగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి వారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, డీఎస్పీ ఆనంద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.