- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఎకరాకు సాగునీరు అందించాం : నిరంజన్ రెడ్డి
దిశ, ప్రతినిధి వనపర్తి : నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో దాదాపు ప్రతి ఎకరాకు సాగునీరు అందించామని , చెప్పుకున్నచోటే పంటల సాగు పండగలా మారిందని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలందరూ తిరిగి సొంత గ్రామం చేరుకొని సాగు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఖిల్లాఘణపురం మండలంలో పలు గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గానికి సాగునీళ్లు తెచ్చామని బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయని, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇస్తున్నామని, ఆసరా ఫించన్లతో అండగా నిలుస్తున్నామని అన్నారు.
ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుభీమా పథకం అమలుచేస్తున్నది , ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందుతే పైరవీకారులకు తావులేకుండా, ఏ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతున్నాయని ఆయన చెప్పారు. రూ.200 ఫించన్ రూ.2016 చేశాం .. రూ.2016 ఫించను దశలవారీగా రూ.5000 వేలకు పెంచుతామని ,మిగిలిపోయిన వారందరికీ ఫించన్లు అందిస్తామని అన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు 32 వేలే అని అదే ఈ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు లక్ష 62 వేలు కాగా మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని ఆయన చెప్పారు. తెలంగాణలో కరెంట్ కష్టాలు లేకుండా చేసుకున్నామని ,భవిష్యత్తులో ఆహారశుద్ధి పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని , ఓట్లేసిన, ఓట్లేయని వారికందరికీ పనులుచేశానని మిగిలిన పనులను సైతం చేసి చూపిస్తానని అన్నారు.
పనిచేసిన వారిని ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉందని కనుక ప్రజలు నేను చేసిన అభివృద్ధిని గుర్తించి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మంత్రి వెంట జెడ్పిటిసి సౌమ్య నాయక్, మండలం పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మారెడ్డి, రంగా రెడ్డి పురుషోత్తం, కార్మిక సంఘం అధ్యక్షులు విక్రమ్, సర్పంచులు మణెమ్మ, శ్రీలత, నిర్మల, కృష్ణవేణి, గోపాల్ నాయక్, శాంత సైదులు, శాంతి భాయి , ఇందిరా, ఉమ, శేఖర్ రెడ్డి, అరుణ, మధు, తదితరులు పాల్గొన్నారు.