రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: చల్లా వంశీచంద్ రెడ్డి

by S Gopi |
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: చల్లా వంశీచంద్ రెడ్డి
X

దిశ, వెల్దండ: ప్రజలు నూతనోత్తేజంతో దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలను గద్దెదించి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గుండాల అంబా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం చల్లా వంశీచంద్ రెడ్డి శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డిని పూర్ణకుంభంతో ఆలయ పూజారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు ముఖ్య అతిథులకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి, వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో దేశంలో మార్పు మొదలైందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అధికార దాహంతో పతనమైన దేశ, రాష్ట్ర, ఆర్థిక వ్యవస్థ, ప్రజా రక్షణలని అయన విమర్శించారు. ఇప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో నిరుద్యోగ విద్యార్థి, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల ప్రజలను ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను వెదజల్లి ఓట్లు దండుకుని నయవంచన చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని అయన అభివర్ణించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు మళ్ళీ పునరావృత్తం అవుతుందని, తాను శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం ప్రజావసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టు సాధన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి కొట్లాడితే మొదలైన పనులు నేటికీ ఎనిమిది యేండ్ల కాలం పూర్తవుతున్నా ఎందుకు చివరి అయకట్టు వరకు సాగునీరు అందకుండా నిర్లక్ష్యం, ఆంతర్యమేమిటి అయన ప్రశ్నించారు. తాను ఏఐసీసీ కార్యదర్శిగా పార్టీ జాతీయ వ్యవహార దృష్ట్యా ఇన్నాళ్లు పార్టీ పనిలో ఉన్నానని మళ్ళీ నియోజకవర్గంలో కార్యకర్తలకు, బాసటగా, అండగా నిరంతరం ఉంటానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మోతిలాల్ నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్ళపల్లి శేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ రెడ్డి, కిసాన్ సెల్ తాలుకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య, కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కుడుముల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జోగయ్య, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ నాయకులు పాండు నాయక్, యాదయ్య, మల్లేష్ గౌడ్, సత్తయ్య గౌడ్, నిరంజన్ గౌడ్, పురుషోత్తమాచారి, ముదిగొండ రమేష్, ఎర్ర శ్రీను, మారేపల్లి శ్రీను, లింగం, గోపాల్, రామకృష్ణ, కొండల్ యాదవ్, అంజి యాదవ్, రామర్జున్, వినోద్, రమేష్ గౌడ్, నల్ల రాజు, రమేష్ నాయక్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed