బస్సు కోసం వేచి చూస్తుండగా అనుకోని ప్రమాదం

by Mahesh |   ( Updated:2023-02-09 08:42:26.0  )
బస్సు కోసం వేచి చూస్తుండగా అనుకోని ప్రమాదం
X

దిశ, దామరగిద్ద: పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమై బస్సు కోసం వేచి చూస్తున్న వ్యక్తి పై విద్యుత్ స్తంభం పడి తీవ్ర రక్త గాయాలైన సంఘటన గురువారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలో వివాహ వేడుకకు గాను స్టేజి అలంకరణ పూర్తి చేసుకొని సామానుతో TS 06 UD 2311 బొలెరో వాహనం నారాయణపేటకు బయలుదేరింది.

ఈ క్రమంలో బొలెరో వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా బస్సు కోసం వేచి చూస్తున్న మద్దెల బీడ్ గ్రామానికి చెందిన దాసరి వెంకటప్ప తలపై పడింది. దీంతో వెంకటప్ప తలకు గాయాలు కాగా పరిస్థితి విషమించి వెంకటప్ప మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై దామరగిద్ద పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వెంకటప్ప మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Next Story