జాగ్రత్తలు పాటిస్తే క్షయవ్యాధిని నయం చేయవచ్చు..

by Kalyani |
జాగ్రత్తలు పాటిస్తే క్షయవ్యాధిని నయం చేయవచ్చు..
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: జాగ్రత్తలు పాటిస్తే క్షయవ్యాధిని నయం చేయవచ్చని లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్బంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. క్షయవ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

వ్యాధి లక్షణాలు, దాని తీవ్రత తగ్గించేందుకు మందులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసే శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం ర్యాలీలో జిల్లా వైద్యాధికారి రాం మనోహర్ రావు, డాక్టర్ శైలజ, అశోక్ మరియు ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story