Tigers Adda: పెద్ద పులులకు అడ్డా.. నల్లమలలోని ఏటీఆర్ గడ్డ

by Shiva |
Tigers Adda: పెద్ద పులులకు అడ్డా.. నల్లమలలోని ఏటీఆర్ గడ్డ
X

దిశ, అచ్చంపేట: ఆసియా ఖండంలో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అడవిలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ అతి పెద్దది. ఈ అడవి కృష్ణా నది పరివాహక ప్రాంతం వెంట సుమారు 180 కి.మీ పొడవున కృష్ణమ్మ ప్రవహిస్తుంది. నల్లమల్ల అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతం కృష్ణా నది కోర్ జోన్ మొత్తం 2166.37 కి.మీ కాగా రిజర్వ్ బఫర్ జోన్ ప్రాంతంగా 445.02 కి.మీ ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. అడవులతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ చర్యలు గడిచిన 78 ఏళ్లగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జంతువైన పెద్ద పులితో పాటు ఇతర వన్య ప్రాణుల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.

అడవిని సంరక్షించే అటవీ శాఖకు వాచర్ నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు సక్రమంగా విధులను నిర్వర్తించడం మూలంగానే నల్లమల్ల అడవుల్లో పెద్ద పులుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 1985 నుంచి 1995 వరకు నల్లమల్ల అడవుల్లో సుమారు 140 పైగా పెద్ద పులులు ఉన్నట్లుగా అప్పట్లో అధికారులు తెలిపారు. కాలక్రమేనా పరిస్థితులు ప్రభావంతో ఆ సంఖ్య రెండంకెలకు పడిపోయింది. గడిచిన ఆరేళ్ల నుంచి పెద్ద పులుల సంఖ్య పెరుగింది. ప్రస్తుతం అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 34 పెద్ద పులులు ఉన్నట్లుగా ఈనెల 11న నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ ఎన్టీసీఏ నివేదికలో వెల్లడైంది.

పెద్దపులులకు అడ్డా నల్లమలలోని ఏటీఆర్ గడ్డ

నల్లమల అటవీ ప్రాంతంలో గడిచిన నాలుగైదు దశాబ్దాల క్రితం సుమారు 140పైగా ఉన్న పెద్ద పులులు.. 2018-19 గణాంకాల ప్రకారం 7 నుంచి 12 మాత్రమే మిగిలాయి. ఈ క్రమంలో పులుల క్షిణత ఏ దశకు చేరుకుందో అర్ధం అవుతోంది. తెలంగాణ రాష్టం ఏర్పాటు అనంతరం నల్లమల అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. గడిచిన నాలుగైదు ఏళ్లలో అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 2018-19లో 7 నుంచి 12, 2020-21లో 14, 2021-22 జాతీయ పెద్దపులులా సెన్సెస్ ప్రకారం 21 కాగా 2023-24 4వ సెన్సెస్ ప్రకారం పెద్ద పులుల సంఖ్య 34, చిరుత పులులు సుమారు 187 పెరిగినట్లుగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ న్యూఢిల్లీ వారు నివేదిక ఈనెల 12న వెల్లడించారు. కాబట్టిపై నివేదికల ఆధారంగా ‘నల్లమల్ల ప్రాంతం పెద్ద పులులకు అడ్డా.. నల్లమల్ల గడ్డ’ అని చెప్పవచ్చని అన్నారు.

4వ ఫేజ్‌లో..

2023- 24లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ న్యూఢిల్లీ వారి గైడ్‌లైన్స్ ప్రకారం.. 12 డిసెంబర్ 2023 నుంచి 12 మే 2024 వరకు నాలుగు నెలల్లో అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతాన్ని అచ్చంపేట, మద్దిమడుగు, అమ్రాబాద్, నాగార్జునసాగర్ 4 బ్లాకులుగా విభజించి ,1086 సీసీ కెమెరాలు ట్రాప్స్ ద్వారా అమ్రాబాద్, అచ్చంపేట రెండు డివిజన్లో 10 రేంజ్‌లు, 903 పులుల అవాస ప్రదేశాలను ఎంచుకుని పెద్ద పులులను లెక్కించారు. ఆ లెక్కింపు ప్రకారం 15 ఫిమేల్ పెద్ద పులులు, 11 మెయిల్ పెద్ద పులులు ఉన్నాయి. అదేవిధంగా 8 కపుల్స్ పులి పిల్లలతో కలిపి మొత్తం 34 పెద్ద పులులు ఉన్నట్లుగా నిర్ధారించారు. 0.8 కిలో మీటర్ల నుంచి రెండు కిలో మీటర్ల విస్తీర్ణంలో సీసీ ఫుటేజ్‌లతో పరిశీలించి జంతువుల లెక్కింపు కొనసాగింది.

1:3 పులులు ఉండాలి: రోహిత్ గోపిడి, డీఎఫ్‌వో

అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులుల ఆవాసాలకు మరింత స్కోప్ ఉందని, ఈ అడవుల్లో 1:3 నిష్పత్తి ఉండాలని, కానీ ఎన్టీసీఏ నివేదిక ప్రకారం 1:1.2 చొప్పున 34 పెద్ద పులుల సంఖ్య ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్ ‘దిశ’కు తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద పులుల సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు. అందుకు తగ్గట్టుగానే వాటికి ఆహార జంతువుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తడోబా అడవుల్లో వాటి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వాటికి జన్మించిన చిన్న పిల్లలను కొన్ని ఘర్షణ కారణాలతో పిల్లలను వదిలేస్తుంటాయని తెలిపారు. వాటిని అనాథ పిల్లలు కాకుండా రివైజ్ చేస్తారో అలాంటి చర్యలు ఇక్కడ చేపడుతామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో అవి కూడా మనుషుల మాదిరిగా గొడవలు పడుతున్న నేపథ్యంలో వాటిని రెస్య్కూ చేయాలని, గ్రాస్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ కూడా మరింతగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. వాచర్ నుంచి ప్రతి ఉద్యోగి కూడా అడవులు, వణ్య ప్రాణులను కాపాడటంలో అంకిత భావంతో పని చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed