సాగు నీరు ఇచ్చి తల ఎత్తుకొని తిరిగేలా చేస్తా : ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి

by Kalyani |   ( Updated:2023-05-06 15:46:36.0  )
సాగు నీరు ఇచ్చి తల ఎత్తుకొని తిరిగేలా చేస్తా : ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: వచ్చే మూడేళ్లలో పేట నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చి తల ఎత్తుకొని తిరిగేలా చేస్తానని, గతంలో అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని మాటకు కట్టుబడి నారాయణపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈసారి కనివినీ ఎరుగని రీతిలో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎస్.ఆర్.రెడ్డి అభిమానులు ఘనంగా నిర్వహించారు.

జిల్లా పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ప్రారంభించి ధన్వాడ, మరికల్, కోయిల్ కొండ, దామరగిద్ద మీదుగా తిరిగి పేటలోని జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం, జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. సింగారం చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో అభిమానులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 35 వేలకు పై చిలుకుగా మెజారిటీని సాధిస్తానని అభిప్రాయపడ్డారు. తనకు బలం బలగం ఎస్. ఆర్ రెడ్డి అభిమానులేనని, నారాయణపేట నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిపిస్తే మరింత సేవ చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఇంతమంది ప్రజా అభిమానం ఉన్న తనకు అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష తప్ప అంతకంటే తనకు ఏం కావాలని పేర్కొన్నారు.

మొదటిసారి ఎన్నికల్లో 2200 ఓట్ల మెజారిటీతో, రెండవ సారి15200 ఓట్ల మెజార్టీతో గెలుపొందానని అన్నారు. నలుగురితో ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానం ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నానని పేర్కొన్నారు. కర్వెనా రిజర్వాయర్ వద్దకు దాదాపు వంద మంది రైతులను తీసుకపోయి నారాయణపేటకు సాగునీరు వచ్చే విధానాన్ని స్వయంగా చూపిస్తానన్నారు. రాబోయే మూడేళ్లలో నారాయణపేటకు 18 నెలల్లో నియోజకవర్గంలోని దామరగిద్ద మండలం మినహా మిగతా మండలాలకు సాగునీరు అందిస్తానన్నారు.

త్వరలోనే కాలువ పనులకు సంబంధించి ఇదే మేనేజర్ టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. తనకు బలం అధికారం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మోసటి జ్యోతి రాజు, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేపూరి రాములు, పోషల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story