- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మాదకద్రవ్యాల నిషేధం( నార్కోటిక్ డ్రగ్స్ )పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేశారా? లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాoటీ డ్రగ్ కమిటీల ద్వారా మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఉన్నత పాఠశాలలోనూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. డి.ఎస్.పి నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటీవలే కోస్గి పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిషేధం పై విద్యార్థులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గతంతో పోలిస్తే డ్రగ్స్ కేసులు చాలా తక్కువ అయ్యాయని ఆయన తెలిపారు. టాస్స్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ పై క్షేత్రస్థాయిలో నిఘా పెట్టడం జరిగిందని డిఎస్పీ వివరించారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఆబ్కారీ శాఖ అధికారులు కూడా మాదకద్రవ్యాల నిషేధంపై కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి నేతత్వంలోనూ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాలను జిల్లాలో పూర్తిగా నిషేధించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఆర్డిఓ రామచంద్రనాయక్, జాన్ సుధాకర్, గోవిందరాజులు, సుదర్శన్ పాల్గొన్నారు.