నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్తున్న ‘దిశ’ : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

by Aamani |
నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్తున్న ‘దిశ’ : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
X

దిశ, కామారెడ్డి : నిజాలను నిర్భయంగా జనాల్లోకి దిశ దినపత్రిక తీసుకెళ్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం దిశ 2025 సంవత్సరం క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు పత్రికారం గంలోనే ట్రెండ్ సెట్టర్ గా మారిన 'దిశ' ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కచ్చితత్వం తో పాటు అత్యంత వేగంగా వార్తలను పాఠకులకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. దిశ చాలా తక్కువ సమయంలోనే లక్షలాది మంది పాఠకుల ఆదరణను సంపాదించుకున్న దన్నారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న పత్రిక యాజమాన్యాన్ని అభినందించారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఎడిషన్ల ద్వారా తాజా సమాచారం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో భీమ్ కుమార్, దిశ ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ ఆడేపు శ్రీనివాస్, కామారెడ్డి ఆర్సీ ఇంచార్జి పెరుమాండ్ల రాజు, రిపోర్టర్లు గౌరిశెట్టి రవికుమార్, మల్కగిరి ఆంజనేయులు, శంకరిగారి నరేష్, కొడకాల గోవర్ధన్, తూర్పు సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed