ఏపీలో ఘోరం.. వదినను చంపి మృతదేహంపై అత్యాచారం

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-01-02 11:46:05.0  )
ఏపీలో ఘోరం.. వదినను చంపి మృతదేహంపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : మానవత్వం రోజురోజుకు మట్టిలో కలిసిపోతోంది. రక్త సంబంధం, వరుసలు, అక్క, వదిన, చెల్లి ఇలా ఎవరైనా చాలు.. కోరిక తీర్చాలనే విధంగా మానవ మృగాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ కామ పిశాచి. అన్న భార్యపై కన్నేసిన మృగాడు.. ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణంగా చంపేసి మరి మృతదేహంతో తన కోరికను తీర్చుకున్నాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కావలి పట్టణంలో శ్రీకాంత్ బిస్వాస్ అనే వ్యక్తి మొలల వ్యాధికి చికిత్స చేస్తూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బిస్వాస్ తన కుటుంబంతో వచ్చి కావలిలో స్థిరపడ్డాడు. శ్రీకాంత్ బిస్వాస్ తల్లిదండ్రులతోపాటు భార్య అర్పితా బిస్వాస్ (25), ఇద్దరు పిల్లలు, తమ్ముడు వరుసయ్య నయ బిస్వాస్ ఒకే ఇంట్లో ఉంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాంత్ బిస్వాస్ తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లగా.. ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్న వారంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ బిస్వాస్ పూటుగా మద్యం తాగి పుల్‌గా నిద్రపోయాడు. అందరూ నిద్రపోయిన తర్వాత నయ బిస్వాస్ వదిన గదిలోకి వెళ్లి కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన వదిన తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అర్పితా బిస్వాస్ అక్కడికక్కడే హతమైంది. అయినా ఏమాత్రం జాలి చూపని నయ బిస్వాస్.. వదిన మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోరిక తీరిన తర్వాత అర్పితా బిస్వాస్ మృతదేహాన్ని ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న పంటకాల్వలో పడేసి వచ్చాడు.

ఉదయం నిద్ర లేచిన శ్రీకాంత్ బిస్వాస్‌కు తన భార్య కనిపించలేదు. ఇంట్లో వెతికినా ఎక్కడా కనిపించలేదు. కానీ ఆమె బెడ్ రూంలో రక్తపు మరకలు కనిపించాయి. ఆందోళన చెందిన భర్త కాలనీ వాసులతో విషయం చెప్పడంతో అంతా కలిసి అర్పితా బిస్వాస్ కోసం వెతికారు. ఈ క్రమంలో రక్తంతో తడిచిపోయిన ఆమె మృతదేహం సమీపంలోని పంటకాల్వలో లభ్యమైంది. అయితే గతంలోనూ వదినను లైంగికంగా వేధించిన నయ బిస్వాస్‌పై అందరికీ అనుమానం కలిగింది. వెంటనే అతడిని పట్టుకోని నిలదీయగా.. రాత్రి జరిగిన ఘోరాన్ని వివరించాడు. నయ బిస్వాస్ కొన్నాళ్లుగా తన కోరిక తీర్చాలని వదిన వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లు సైతం అతడిని హెచ్చరించారు. అయినా బుద్ధి మార్చుకోని కామాంధుడు చివరికి ఆమెను హత్య చేసి మృతదేహంతో కోరిక తీర్చుకున్నాడు. ఈ దుశ్చర్యపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

Read More : దారుణం.. కర్రతో కొట్టి తాడుతో ఉరివేసి భర్తను చంపిన భార్య

Advertisement

Next Story

Most Viewed