AP News:తొలి ఖో ఖో ప్రపంచ కప్‌ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

by Jakkula Mamatha |
AP News:తొలి ఖో ఖో ప్రపంచ కప్‌ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్ వేదికగా జనవరి13-19వ తేదీల మధ్య ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సచివాలయంలోని రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి కార్యాలయంలో అద్దంకి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ బీ.సీహెచ్ గరటయ్య ఆధ్వర్యంలో ఖో ఖో ప్రపంచ కప్‌ పోస్టర్‌ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad Reddy) ఆవిష్కరించారు. దేశ రాజధానిలో ప్రపంచ కప్‌ నిర్వహిస్తుండటాన్ని మంత్రి ప్రశంసించారు. ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటం చూసి ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

వారం రోజుల పాటు జరిగే ఖో ఖో(Kho Kho) ప్రపంచ కప్‌లో టోర్నమెంట్‌లో 21 పురుషుల, 20 మహిళల జట్లు పోటీ పడతాయి. మొత్తం 24 దేశాల జట్లు టోర్నమెంట్(tournament) కోసం భారత్‌కు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖో ఖో అభిమానులకు ఈ ఆటలోని అనుభవాన్ని ఈ టోర్నమెంట్ అందించనుందని, ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలను అందించడంపై దృష్టి సారిస్తోందని అందుకే, పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన వేదికను ఏర్పాటు చేశామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed