CM Revanth: దీప్తి జీవాంజికి అర్జున అవార్డు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం

by Ramesh N |   ( Updated:2025-01-02 12:06:05.0  )
CM Revanth: దీప్తి జీవాంజికి అర్జున అవార్డు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి (Deepthi Jeevanji) విశిష్ట క్రీడా పురస్కారం (Arjuna Award) అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా సీఎం చేతుల మీదుగా 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేశ్‌కి రూ. 10 లక్షల నగదు బహుమతిని గతంలోనే అందజేశారు. అదే సమయంలో దీప్తి‌కి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వరం‌గల్‌లో 500 గజాల స్థలం కేటాయించాని నిర్ణయించిన విషయం తెలిసిందే.

తెలంగాణ (Telangana) యువ క్రీడాకారులు మరింతగా రాణించాలని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మితం కానున్న స్పోర్ట్స్ కాంప్లెక్సులు అందుకు దోహదపడతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేశ్ దొమ్మరాజు (చెస్), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్) లకు సీఎం అభినందనలు తెలియజేశారు. 2024 లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు సీఎం గురువారం ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed