- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఎస్ తో ఆర్థిక భద్రత లేదు..
దిశ, మహబూబ్ నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అభివృద్ధికి అహర్నిశలు పనిచేసిన ఉద్యోగులు రిటైర్డు అయ్యాక ఆర్థిక భద్రత లేకపోవడం బాధాకరమని కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సనాతన బాలస్వామి అన్నారు. సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆదివారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి ఆయన వినతిపత్రాన్ని సమర్పించి మీడియాతో మాట్లాడారు. పాత పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు నిర్థిష్ట పెన్షన్ లభించేదని, సీపీఎస్ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత లోపించిందని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునః ప్రవేశపెడతామనే హామీ ఇచ్చిన పార్టీకే తమ ఓటు అని ఆయన అన్నారు. ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ మాట్లాడుతూ లోపభూయిష్టమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే ఆందోళనలు ఉదృతపరుస్తామని, వెంటనే ఓపీఎస్ ను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ర్యాలీలో మున్ని, విజయ్ కుమార్, గోవర్ధనచారి, వెంకటయ్యగౌడ్, రాఘవేందర్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీధర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.