- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ఊరికి కరెంటు, నీళ్లు ఇవ్వండి సారూ..
దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోని గువ్వలోనిపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా త్రాగు నీరు గ్రామస్థులు విలవిలలాడుతున్నారు. జూన్ 7వ తేది సాయంత్రం వీచిన ఈదురు గాలులకు కొన్ని కరెంట్ స్తంభాలు విరిగిపడడంతో ఆ రోజు నుంచి మూడు రోజులపాటు గ్రామస్థులు చీకట్లోనే మగ్గుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి తూతూ మంత్రంగా పనులు చేసి మమ అనిపించారని తెలిపారు. మళ్ళీ అదే తంతు కొనసాగడం అప్పటి నుండి ఇప్పటివరకు అధికారులు స్పందించడం లేదని వాపోయారు. ఓ రైతు పొలంలో విరిగిన స్తంభాలు ఇప్పటి వరకు పునరిద్దరించలేదన్నారు.
దాంతో కరెంట్ సప్లై సరిగ్గా లేక మోటర్లు నడువక పక్క గ్రామ పంచాయతీ లత్తీపూర్ నుంచి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తో త్రాగు నీటిని సరఫరా చేస్తున్నారని వాపోయారు. అసలే మండుతున్న ఎండలు గ్రామంలో ఉన్న ప్రజలే నీటికోసం అల్లాడుతున్నారు. మరి మూగ జీవాల పరిస్థితి ఏంటని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే విరిగిన స్తంభాలు పునరుద్ధరించి గ్రామానికి పవర్ సప్లై అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేని యెడల గ్రామస్థులంతా కలిసి విద్యుత్ సబ్స్టేషన్, కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.