- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు.. సజ్జనార్ ప్రశంసలు
దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన TS09Z8101 బస్సులో బుధవారం కొల్లాపూర్ నుండి హైదరాబాదుకు వెళ్తున్న ప్రయాణికులు జడ్చర్ల బస్టాండ్ లో తమ బ్యాగును మరిచి బస్సు దిగి వెళ్లిపోయారు. మర్చిపోయిన బ్యాగు కోసం జడ్చర్ల బస్ స్టేషన్ మేనేజర్ ను ఆశ్రయించారు. వారు ఆ బస్సు కండక్టర్ శ్రీనివాసులు, డ్రైవర్ నాగరాజుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫోన్ సమాచారంతో కండక్టర్, డ్రైవర్ అప్రత్తమై ఆ బ్యాగును గమనించి ఎంజీబీఎస్ బస్టాండులో భద్రపరచి సదరు ప్రయాణికులకు బ్యాగును అప్పచెప్పారు. బ్యాగులో ఉన్న రూ.లక్ష, ఒక సెల్ ఫోన్, పాయింట్ కంట్రోలర్ హమీద్ పోలీసుల సమక్షంలో ఎంజీబీఎస్ లో బాధితులకు అందజేశారు. డ్రైవర్, కండక్టర్లకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ సంస్థ ఎండి సజ్జనార్ ఉద్యోగస్తులను అభినందించారు. వారితోపాటు స్థానిక రీజనల్ మేనేజర్ శ్రీదేవి, డిపో మేనేజర్ ఉమా శంకర్ ఉద్యోగస్తులకు అభినందించారు.