congress party : కాంగ్రెస్ ప్రభుత్వం పై అవాక్కులు చివాకులు చేస్తే ఖబడ్దార్..

by Sumithra |
congress party : కాంగ్రెస్ ప్రభుత్వం పై అవాక్కులు చివాకులు చేస్తే ఖబడ్దార్..
X

దిశ, బిజినేపల్లి : మండల బీఆర్ఎస్ నాయకులు వారి స్థాయి ఏంటో నిరూపించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పై విమర్శలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిద్దె రాములు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించి ఏ ఒక్క నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందిన దాఖలాలు లేవని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన మోసాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు జైల్ జీవితం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో యాదవులను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. గత పది సంవత్సరాలు పాలించిన ఏ ఒక్క రైతు బాగుపడిన దాఖలాలు లేవని అంతేకాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం కాబట్టి మొదటగా ఒకే దబాలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. బీఆర్ఎస్ మండల నాయకులు స్థాయి మించి సీఎం రేవంత్ రెడ్డిని అవాక్కులు చివాకులు చేస్తే ఖబర్దార్. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ముందుంది గనుక మొదటగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.

బిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఇసుక నల్ల మట్టి అమ్ముకొని బీఆర్ఎస్ నాయకులు కోట్లు సంపాదించుకున్న ఘనత బీఆర్ఎస్ నాయకులదని అన్నారు. పేద ప్రజలకు డబల్ బెడ్ రూములు దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలని అప్పుడు ఇస్తామని నోరూర పూరించి వారికి గుండు సున్న పెట్టారని విమర్శించారు. ప్రజలు తెలివైన వారు కాబట్టి బీఆర్ఎస్ చేసిన మోసపూరిత పాలనను అంతం ముందుంచి కాంగ్రెస్ ను తెచ్చుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉంటే అట్టి తెలంగాణను అప్పుల తెలంగాణగా చేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ఉద్యోగికి ఏ నెలలో ఏ తారీఖున జీతం పడుతుందో తెలియదు, వారు తీసుకున్న రుణాలకు సివిల్ స్కోర్ పడిపోయి అయోమయంలో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి తారీకు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నసీర్, వట్టెం మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి, ముక్తార్ ,మాజీ పీఎస్సీ చైర్మన్ వెంకట్ స్వామి, ఈశ్వర్ ,తిరుపతయ్య, బాలరాజ్, మిద్దె సూరి, సైదులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story