బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..

by Sumithra |
బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..
X

దిశ ప్రతినిధి, నారాయణపేట : రాష్ట్రంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొండా సత్యయాదవ్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పేట 20వ వార్డులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి తలమానికంగా మారిన 370 ఆర్టికల్ రద్దు చేయడం, శతాబ్దాలుగా కళ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, భారత్ మాల 14 లైన్ ల రహదారి, కాశీ కారిడార్, బుల్లెట్ ట్రైన్ రాఫెల్ లాంటి విప్లవాత్మక చారిత్రాత్మక విజయాలు సాధించిన భారతీయ జనతా పార్టీ 18 కోట్ల సభ్యత్వాలు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా ఎదిగిందన్నారు.

అలాగే నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు మండలంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రనాయకులు రతంగపాండు రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ప్రభాకర్ వర్ధన్, రఘురామయ్య గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందు నామాజీ, రఘువీర్ యాదవ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story