లొద్ది మల్లయ్య జాతర నిలిపివేయాలని అటవీ శాఖ ఆదేశాలు జారీ

by Anjali |
లొద్ది మల్లయ్య జాతర నిలిపివేయాలని అటవీ శాఖ ఆదేశాలు జారీ
X

దిశ, వెబ్‌‌డెస్క్: లొద్ది మల్లయ్య జాతర నిలిపివేయాలని అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అచ్చంపేట నల్లమల అటవీ పరిసర ప్రాంత ప్రజలు తొలి ఏకాదశి తేది 17-07-2024 రోజున జరుపుకునే లొద్ది మల్లయ్య జాతరను ఈ ఏడాది ఎన్. టి. సి. ఏ. ఆదేశాల మేరకు జాతరను నిలిపివేసింది. అటవీ ప్రాంతంలో పులి పిల్లలతో ఉన్నది.. వన్యప్రాణుల సంచారం పెరిగిపోయిందని వెల్లడించింది. కాగా అటవీ పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు, యాత్రికులు ఈ విషయాన్ని గమనించగలరని తెలిపింది. ఎవరూ కూడా అడవిలోనికి రాకూడదని అటవీశాఖ అధికారులకు సహకరించగలరని అచ్చంపేట నల్లమల అటవీ పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇది జంతువుత పునరుత్పత్తి సమయం కావున ప్రతి ఒక్కరూ ప్రకృతికి సహకరించగలరని కోరుతున్నామని పేర్కొంది. ఎవరరైనా అడవిలోకి ప్రవేశించితే వారిపై వైల్డ్ లైఫ్ చట్ట ప్రకారం శిక్షి విధిస్తామని వెల్లడించింది. అలాగే అడవిలో వాహనాలు కనిపించిన అప్పటికప్పుడే సీజ్ చేసి పడేస్తామని అచ్చంపేట ఫారెస్ట్ అధికారి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed