జూరాలకు మళ్లీ పెరిగిన వరద

by Mahesh |
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
X

దిశ, గద్వాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. నీటి ప్రవాహం తగ్గడంతో వారం రోజుల క్రితం గేట్లు మూసి వేయగా.. మూడు రోజుల నుంచి జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం‌ రాత్రి 9.45 గంటల సమయంలో ప్రాజెక్టుకు 54,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..అయిదు క్రస్టు గేట్ల ద్వారా 20,865 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. అదేవిధంగా 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 40,340 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 64,515 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 9.480 టీఎంసీలుగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed