- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యం,విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం
దిశ,వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత విద్యా,వైద్యం అందించాలన్న లక్ష్యంతో పాలనందిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నా రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో..నూతన భారతీయ జన ఔషదీ కేంద్రంను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..పేద ప్రజలకు ప్రైవేట్ కంపెనీల ధరల కన్నా సగం ధరలకే ఔషదాలను(మందులను) ఔషదీ కేంద్రాలలో లభిస్తాయన్నారు. ప్రజలు ఔషద కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నా రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అవుట్ పేషంట్ వార్డు,టీబి,ఆరోగ్య శ్రీ, రెడ్ క్రాస్ సొసైటీ విభాగలలో హాజరు పట్టికలను పరిశీలించారు. రికార్డులు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో అమలు చేస్తున్న ఉచిత పథకాల అమలు చేస్తున్న పథకాలు,వైద్య సేవలు అందిస్తున్న తీరుపై ఆరా తీశారు. ఆసుపత్రిలో,పరిసరాలలో శుభ్రత పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది నిబద్దత తో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించి..ప్రజలకు వైద్య సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్,మండల అధ్యక్షుడు కదిరే రాములు,మైనారిటీ నాయకులు ఎండి బాబా,కాంగ్రెస్ నాయకులు భాస్కర్,ప్రభుత్వ ఆసుపత్రి ఏఓ శ్రీనివాసులు,వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.