MLA Dr. Rajesh Reddy : ఆపదలో ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..

by Sumithra |
MLA Dr. Rajesh Reddy : ఆపదలో ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
X

దిశ, తెలకపల్లి : రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని తెలకపల్లి మండలం కేంద్రంలో ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్నవారు పేదలకు సహాయం అందిస్తే ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని అన్నారు. కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాజకీయాలకు అతీతంగా పంపిణీ చేస్తున్నామని, గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు.

నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో ప్రజల మధ్య ఉంటేనే వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయని అన్నారు. వాటిని పరిష్కరించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలలోనే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తారని, విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, ఇప్పటికే మూడు గ్యారెంటీలను అమలు చేస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలకపల్లి మండల ఇంచార్జ్ బండ పర్వతాలు వారణాసి శ్రీను ప్రకాష్, బుచ్చిరెడ్డి, సింగల్ విండో వాయిస్ ప్రజెంట్ యాదయ్య, ఎంపీటీసీ సుమిత్ర విజయలక్ష్మి, యువ నాయకులు జిలాని ఎల్లస్వామి మల్లేష్ గౌడ్ అనీలు రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed