- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించడమే లక్ష్యం : కేంద్ర సహాయ మంత్రి భగవంతు ఖుబా
దిశ,దేవరకద్ర : వచ్చే ఎన్నికల్లో దేవరకద్ర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఆశవాహులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి సూచించారు. శుక్రవారం దేవరకద్ర మండల కేంద్రంలో ని పవన్ కుమార్ రెడ్డి స్వగృహంలో ప్రత్యేక కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి భగవంతు ఖుభా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గెలిపించేందుకు సర్వశక్తుల కృషి చేయాలని సూచించారు.
కాబోయే రోజులు పార్టీకి చాలా కీలకమని ప్రతి కార్యకర్త అవిశ్రాంతంగా ప్రచారం చేయాలని కోరారు. పార్టీ అధిష్టానం సూచించిన మార్గ నిర్దేశకాలతో పార్టీ సిద్ధాంతాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ నెల 16న అన్ని కమిటీలతో చర్చించి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎగ్గని నర్సింహులు ,పవన్ కుమార్ రెడ్డి, బాల మణెమ్మ ,అసెంబ్లీ కన్వీనర్ కురువ రమేష్ ,నాగరాజు, ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు దేవరకద్ర బాలన్న, జిల్లా నాయకులు నాంబి రాజు, కొత్త కాపు నారాయణరెడ్డి ,మాధవరెడ్డి యజ్ఞ భూపాల్ రెడ్డి ,మున్నూరు రమేష్ ,అంజన్ కుమార్ రెడ్డి వివిధ మండల అధ్యక్షులు, మోర్చ నాయకులు ,యువకులు తదితరులు పాల్గొన్నారు.