తెలంగాణ వీరమాత చాకలి ఐలమ్మ

by Sridhar Babu |
తెలంగాణ  వీరమాత చాకలి ఐలమ్మ
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన వీరమాత చాకలి ఐలమ్మ అని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు.

రాష్ట్రంలో మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె అందించిన కృషి గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రాములు, సురేష్ కుమార్, డీఎస్పీ లు, రమణారెడ్డి, శ్రీనివాసులు, సుదర్శన్, ఎస్బీ సీఐ శివకుమార్, ఆర్ఐ కృష్ణయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story