తెలంగాణ దశాబ్ది వేడుకలు ఎవరికోసం.. బచ్చల కూర బాలరాజ్

by Sumithra |
తెలంగాణ దశాబ్ది వేడుకలు ఎవరికోసం.. బచ్చల కూర బాలరాజ్
X

దిశ, కొల్లాపూర్ : మండలం కొల్లాపూర్ మండలం పరిధిలోని శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ దళితదండు వ్యవస్థాపక అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంటే తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషిస్తుంది. తెలంగాణ విముక్తికోసం ఉద్యమకారులు ఏకతాటిపైకి తీసుకువచ్చి బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆకాంక్షలు ఆశయాలు అనుగుణంగా ప్రభుత్వ నడుస్తుంది అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో నియంతృతం నయ భూస్వామ్య పరిపాలన కొనసాగుతుంది.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను నయవంచనతో మోసం దగాతో ప్రజల్ని పరిపాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దిరించాలి. నిత్యం ప్రజలని ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ప్రజల మోసం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు నిరంకుషమైన దోపిడి పరిపాలన కొనసాగిస్తూ ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ పరిపాలన విముక్తి కోసం ఉద్యమకారులు ప్రజాసంఘాలు దళిత సంఘాలు ఏకం కావలసిన అవసరం ఉంది. అమరవీరులు కలలుగన్న రాష్ట్ర స్వప్నం నెరవేర్చుకునే క్రమంలో ఉద్యమ శక్తులంతా ఒక గొడుగు కిందికి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి విముక్తి పొందవచ్చు.

Advertisement

Next Story