ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

by Naveena |   ( Updated:2024-11-08 15:49:42.0  )
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ,వనపర్తి : ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. (స్వీప్)ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం - 2025 లో భాగంగా వనపర్తి జిల్లా లో నవంబర్ 9వ,10 వతేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 1వ తేదీ 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత,కొత్త ఓటర్ గా నమోదు చేసుకునేందుకు,మార్పులు సవరణకు,వెలువడిన ఓటరు జాబితాలో అభ్యంతరాల తెలిపేందుకు కోసం బూత్ లెవల్ ఆఫీసర్లు తమ బూత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారన్నారు. నూతన ఓటరు గా నమోదుకు ఫామ్ -6,అక్టోబర్ 29 న విడుదల చేసిన ఓటర్ ముసాయిదా లో అభ్యంతరాల కోసం ఫారం - 7, సవరణలకు ఫారం - 8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తూ చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ప్రజలు. ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైటు ద్వారా కూడా దరఖాస్తూ చేసుకోవచ్చునన్నారు.

Advertisement

Next Story

Most Viewed