- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పదంగా రైతు మృతి..
దిశ, గద్వాల / గట్టు: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన నాయిని లక్ష్మయ్య (45) అనే రైతు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు లక్ష్మయ్య రోజు మాదిరిగానే తన పొలం దగ్గరికి వెళ్ళి అక్కడే నిద్రించాడు. ఉదయం ఇంటికి రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా అక్కడ శవమై కనిపించాడని విలపించారు.
రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గట్టు ఎస్ఐ ని సంప్రదించగా రైతు లక్ష్మయ్య తన పొలం దగ్గర మృతి చెందిన విషయం వాస్తవమే అన్నారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం, రైతు మృతికి కారణాలు తెలియ రాలేదన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమాదాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం శవాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.