టాస్క్ సీఓఓగా సుంకిరెడ్డి

by Sridhar Babu |
టాస్క్ సీఓఓగా సుంకిరెడ్డి
X

దిశ, కల్వకుర్తి : తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఓఓగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్ లోని టాస్క్ కార్యాలయంలో సీఈఓ శ్రీకాంత్ సిన్హా చేతుల మీదుగా బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు నైపుణ్యం నేర్పి ఉపాధి పొందేలా చేస్తామని అన్నారు. తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతీ, యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, అభిమానులకు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed