నిర్మాణం పూర్తైన ప్రారంభానికి నోచుకోని సబ్‌స్టేషన్లు

by Mahesh |
నిర్మాణం పూర్తైన ప్రారంభానికి నోచుకోని సబ్‌స్టేషన్లు
X

దిశ, మక్తల్: మక్తల్ మండలం 33/12 రెండు సబ్ స్టేషన్లు నిర్మాణమై. ఆపరేటర్లు లేక ఒకటి. కట్టిన సబ్ స్టేషన్‌కు రోడ్డు లేక మరొకటి సంవత్సరాలు గడుసున్న ప్రారంభానికి నోచుకోలేదు. దశాబ్ది ఉత్సవాల్లో విద్యుత్ వినియోగ ఉత్సవాలు జరుపుకుంటున్న అధికారుల నిర్లక్ష్యం పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని ఆ సబ్ స్టేషన్ల పరిధి కింద ఉన్న రైతులు అంటున్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం అంటు వోల్టేజ్ సమస్య తీరుస్తాను కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆగమేఘాల మీద సబ్ స్టేషన్లను నిర్మాణం చేసిన వాటిని ప్రారంభించడానికి, ఆపరేటర్లను, సిబ్బందిని నియమించక పోవడం నేటికి దిష్టి బొమ్మలా నిలబడి పోయాయి. ఇదే అదునుగా అక్కడ సిబ్బంది రక్షణ వ్యవస్థ లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు చేతికి పని చెబుతున్నారు.

వివరాల్లోకెళ్తే మక్తల్ మండలంలో కర్ని పంచాయతీలోని గ్రామాల్లో వ్యవసాయ నిమిత్తం లో ఓల్టేజ్ నివారణకు గాను చుట్టుపక్కల పట్ట భూములు కలిగి ఉండి మధ్యన ప్రభుత్వ భూమిలో 2017 సంవత్సరంలో కోటి 45 లక్షలతో సబ్ స్టేషన్ నిర్మాణం, భూమి పూజ చేసి సంవత్సరంలోపట సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. అన్ని హంగులతో ఏర్పాటైన సబ్ స్టేషన్ ప్రారంభించడానికి గాను సమాయుత్తమవుతుండగా ఆ సబ్ స్టేషన్ కు వెళ్లేందుకు చుట్టుపక్కల పట్టా భూముల వారు తమ భూముల్లో సబ్ స్టేషన్‌కు రోడ్డు వదిలేది లేదని అడ్డుకోవడంతో ప్రారంభం మాగిపోయింది.

ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టా భూములతో మాట్లాడి రోడ్ ఏర్పాటు చేస్తానని, మాట ఇచ్చిన తెలంగాణ ఉత్సవాలు జరిపే అంతవరకు ఆచరణలోకి రాలేదు. బోర్లు బావుల మీద ఆధారపడిన వ్యవసాయం చేస్తున్న గుడిగండ్ల ప్రాంత రైతుల లో వోల్టేజ్ నివారణ గాను కోటి 60 లక్షలతో సబ్ స్టేషన్ నిర్మాణమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. ఆపరేటర్లను సిబ్బందిని నియమించక పోవడం తో రెండు సబ్ స్టేషన్లు సంవత్సరాలు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యం. పాలకుల చొరవ లేక పోవడంతో సబ్ స్టేషన్లు ప్రారంభానికి నోచుకోలేదు. దశాబ్ది ఉత్సవాల ప్రారంభంలోనైనా సబ్ స్టేషన్లు ప్రారంభమై లో వోల్టేజ్ నుండి బయట పడవచ్చు అని రైతులు ఆశగా ఎదురు చూసినా.. అది నిరాశ గానే మిగిలింది.

Advertisement

Next Story

Most Viewed