రేపే పడమటి అంజన్న తిరునాళ్లు ప్రారంభం.. యుద్ధ ప్రాతిపదికన స్ట్రీట్ లైట్ల ఏర్పాటు

by Javid Pasha |   ( Updated:2022-12-04 14:28:37.0  )
రేపే పడమటి అంజన్న తిరునాళ్లు ప్రారంభం.. యుద్ధ ప్రాతిపదికన స్ట్రీట్ లైట్ల ఏర్పాటు
X

దిశ, మక్తల్: రేపటి నుంచి పడమటి ఆంజనేయస్వామి తిరునాళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో మక్తల్ పట్టణంలోని జాతీయ రహదారిపై స్ట్రీట్ లైట్లను యుద్ధ ప్రాతిపదికను అమరుస్తున్నారు. లైట్ల ఏర్పాటును ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఓ కాంట్రాక్టర్ కు అప్పజెప్పారు. ఇవాళ రాత్రి లోగా లైట్ల ఏర్పాటు పూర్తి కావాలని సదరు కాంట్రాక్టర్ ను ఎమ్మె్ల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు రాత్రి వేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారికి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. పనులు పూర్తయితే ఆ లైట్ల వెలుతురులో మక్తల్ పట్టణం జిగేలుమంటుందని స్థానికులు అంటున్నారు.

Advertisement

Next Story