- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగని వీధికుక్కల దాడులు.. గద్వాల జిల్లాలో బాలుడిపై విరుచుకుపడిన శునకాలు
దిశ, అలంపూర్ : రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. ఒంటరిగా కనిపించే చిన్నారులపై శునకాలు విరుచుకుపడుతున్నాయి. మూకుమ్మడి దాడులతో మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. వీధి కుక్కల దాడులపై ఒకవైపు ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. శుక్రవారం ఉదయం మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామానికి చెందిన రేవంత్(6) అనే బాలుడు కుక్కల దాడిలో తీవ్రగాయాల పాలయ్యాడు. బోయ పరశురాముడు-శిరీష దంపతుల కొడుకు రేవంత్.. ఉదయాన్నే ఇంటిముందు ఆడుకుంటున్నాడు. అంతలో తల్లి శిరీష పాలప్యాకెట్ తీసుకురావాలని చెప్పగా.. షాపుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే రేవంత్ పై వీధికుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాయి.
రేవంత్ కనురెప్పలు, చేతులు, తలపై గాయపరిచాయి. రేవంత్ అరుపులు విన్న తల్లిదండ్రులు, స్థానికులు అక్కడికి పరుగున చేరుకుని కుక్కల్ని తరిమికొట్టారు. బాలుడిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేస్తున్నారు. వీధికుక్కల బెడద ఎక్కువైందని, వాటిని కట్టడి చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.