మక్తల్ టౌన్​లో అర్ధరాత్రి ఎస్పీ పర్యటన

by Sridhar Babu |
మక్తల్ టౌన్​లో అర్ధరాత్రి  ఎస్పీ పర్యటన
X

దిశ, మక్తల్ : మక్తల్ టౌన్ లో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి పర్యటించారు. ప్రధాన చౌరస్తాలైన గాంధీచౌక్, ఆజాద్ నగర్, రామ్ లీలా మైదానం, జామియా మజీద్, షరీఫా మసీద్, నూర్ మజీద్ తదితర ప్రధాన చౌరస్తాలను స్వయంగా వీక్షించి పోలీసులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. మక్తల్ మండలంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని, దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story