Srinivas Goud : కల్తీ మద్యం అమ్మితే పీడీ కేసులే

by Kalyani |   ( Updated:2023-09-30 12:55:54.0  )
Srinivas Goud : కల్తీ మద్యం అమ్మితే పీడీ కేసులే
X

దిశ,మహబూబ్ నగర్: కల్తీ మద్యం అమ్మితే పీడీ యాక్టు కేసులను నమోదు చేస్తామని,ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.జిల్లా కేంద్రంలో ఎస్వీఎస్ ఆస్పత్రి వెనుక నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ..గతంలో మద్యం అమ్మకం దారులు,లైసెన్స్ దారులు డూప్లికేట్ మద్యం కంపెనీలు ఏర్పాటు చేసి కల్తీ మద్యం కల్లును అమ్మి ప్రజల జీవితాలతో చెలగాటమాడేవారని అన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం తో పాటు,ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలను కట్టుదిట్టం చేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు,సిబ్బంది కృషి వల్ల ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు.జిల్లా కార్యాలయంలో ఎక్కువగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న దృష్ట్యా ఎక్సైజ్ కమిషనర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సంబంధించిన సమస్యలను తీర్చాలని ఆదేశించారు.ఎక్సైజ్ కార్యాలయం పక్కనే భవిష్యత్తులో అతిథి గృహం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎక్సైజ్ శాఖ రాబోయే కాలంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని,అయిదేళ్ళలో ఎన్ని ఇబ్బందులు,అవాంతరాలు వచ్చినా శాఖలో అందరికీ పదోన్నతులు,బదిలీలు,అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ ఎస్పీ కె.నరసింహ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కె.యాదయ్య,ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తు రాజు గౌడ్,ఎక్సైజ్ సూపరింటిండెంట్ సైదులు,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్,డిసిసిబి ఇన్చార్జి అధ్యక్షులు కోరమని వెంకటయ్య,మున్సిపల్ చైర్మన్ కేసి నరసింహులు,కౌన్సిలర్లు వనజ,కట్టా రవికిషన్ రెడ్డి,ఎక్సైజ్ శాఖ సిఐ వీరారెడ్డి,అధికారులు ప్రజా ప్రతినిధులు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో స్టేడియం…


తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో స్టేడియం,గ్రామ పంచాయతీలలో క్రీడా ప్రాంగణాలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.జిల్లా కేంద్రంలోని స్టేడియం ఆవరణలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని గుత్తా జ్యాల తో కలసి ప్రారంభించి,ఆమెతో కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు.ఈ సందర్భంగా గుత్తా జ్యాల మాట్లాడుతూ మహబూబ్ నగర్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఇంత గొప్పగా అంతర్జాతీయ స్థాయి ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మించడం గొప్ప విషయమని,హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కంటే ఇది పెద్దగా ఉందని ఆమె కొనియాడారు.యువతలో క్రీడా స్పూర్తిని పెంపోందింపజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవను ఆమె అభినందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ జి.రవినాయక్,ఎస్పీ కె.నరసింహ,మున్సిపల్ చైరైన్ నర్సింహులు,రాజేశ్వర్ గౌడ్,గణేష్,పంచాయత్ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ నరెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null