పట్టుపడ్డ వాహనాలు వేలానికి సిద్ధం: ఎస్పీ నరసింహ

by Kalyani |
పట్టుపడ్డ వాహనాలు వేలానికి సిద్ధం: ఎస్పీ నరసింహ
X

దిశ, జడ్చర్ల: జిల్లా పోలీసు శాఖ తనిఖీలలో పట్టుబడ్డ వాహనాలను ఎవరు తీసుకెళ్లనందున వాటిని బహిరంగ వేలం చేయడం జరుగుతుందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ ఎన్. నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పోలీసు ఆధీనంలో 86 వాహనాలు ఉన్నట్లు తెలిపారు. ఈ వాహనాలకు సంబంధించిన వివరాలను ఫేస్ బుక్, ట్విట్టర్ ఇతర సామాజిక మాద్యమాల్లో ఉంచామని తెలిపారు. ఇందులో ఆరు చక్రల వాహనం ఒకటి, నాలుగు చక్రాల వాహనం ఒకటి, మూడు చక్రాల వాహనాలు 8, ద్విచక్ర వాహనాలు 76 ఉన్నట్లు తెలిపారు.

వీటిని జడ్చర్లలోని పోలీసు శిక్షణా కేంద్రములో ఉంచామని. ఈ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేసన్ నెంబర్, ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ ఆధారంగా గుర్తించి బాధితులకు అప్పగించడం జరుగుతుందన్నారు. సర్టిఫికెట్లు తీసుకొని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సెల్ నెంబర్ 8712659329 ని సంప్రదించాలని సూచించారు. ఈ వాహనాలను ఎవరు తీసుకపోని పక్షం లో వాటిని 3 జూన్ 2023 న జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో చట్టప్రకారం బహిరంగ వేలం వేయడం జరుగుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed