- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు..
దిశ, మద్దూరు : నారాయణ పేట జిల్లా మద్దూరు మండలానికి చెందిన 49మంది సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. అప్పులు చేసి ప్రతి గ్రామ పంచాయతీలో నిరంతరం గ్రామాబివృద్దికి శ్రమిస్తూ పనిచేస్తున్న మాపై ప్రభుత్వం వివక్ష చూపడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. గతవారం క్రితం జిల్లా కలెక్టర్ కు సమ్మెనోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో నేడు జరిగే సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డితో పాటు సర్పంచులు సమావేశం నుండి బయటికి వెళ్ళిపోయారు.
అనంతరం ఎంపీటీసీలు, పలుశాఖల అధికారులతో సమావేశాన్ని కొనసాగించారు. వెటర్నరీ అధికారి మాట్లాడుతున్న సమయంలో గొల్ల కురుమలకు ప్రభుత్వం నుండి సబ్సిడీ పై వచ్చే గొర్రె పిల్లలకు సంబంధించిన లబ్దిదారుల లిస్టు ఎంపీటీసీలకు ఇవ్వక పోవడంపై మద్దూరు ఎంపీటీసీ వెంకటయ్య అధికారులను ప్రశ్నించారు. అనంతరం సభను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ లక్ష్మి, ఎంపీడీఓ విజయలక్ష్మి, విద్యుత్ ఏఈ మహేష్, డీఈ, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి, పలు శాఖల అధికారులతో పాటు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.