- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్
ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని, హిందూ ధర్మం గొప్పతనాన్ని బంజారాలకు తెలిపిన గొప్ప మహానీయుడని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్థానిక పద్మావతి కాలనీ అయ్యప్ప గుట్ట పైనున్న సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ఆయన 'మహాభోగ్' ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లడుతూ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి అడిగిన వెంటనే స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.
భవిష్యత్తులో ఆలయం వద్ద పేద గిరిజన జంటలకు జరిగే సామూహిక వివాహలకు తన వంతుగా ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. అదేవిధంగా రూ.కోటి నిధులతో గిరిజన భవన్ నిర్మాణం చేపడుతున్నామని, తండాలను పంచాయితీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతోందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ చంద్రానాయక్, కార్యదర్శి దేవుజా నాయక్, గోపాల్ నాయక్, గిరిజన సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఛత్రునాయక్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంత్ సేవాలాల్ చిత్ర పటంతో పట్టణంలో నిర్వహించిన ఊరేగింపులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.