- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'దిశ'వార్త పై మండిపడుతున్న ఆర్టీసీ మహిళా డాక్టర్
దిశ,బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా పాలెం బస్ స్టేషన్ లో ఇటీవలే ఎమ్మెల్యే కుచ్చికుళ్ళ రాజేష్ రెడ్డి తో ఆర్టీసీ క్లినిక్ ప్రారంభించారు.గత 10 రోజుల నుంచి అక్కడ డాక్టర్ రావడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు ఫిర్యాదు చేయగా,ఆర్టీసీ క్లినిక్ పై "పేరుకే ఆర్టీసీ ఆసుపత్రి వైద్య సేవలు నిల్" పై బుధవారం వచ్చిన వార్తపై పాలెం ఆర్టీసీ మహిళా డాక్టర్ మండిపడ్డారు.దిశ వార్త ఎఫెక్ట్ తో సోమవారం నుండే క్లినిక్ కు డాక్టర్ వస్తుందని తెలుసుకొన్న"దిశ" డాక్టర్ ను కలవడానికి క్లినిక్ కు వెళ్ళిన రిపోర్టర్ ను దూషిస్తూ,"నేను పది రోజుల నుంచి రావడం లేదని ఎవరు చెప్పారు.
నీవు ఎలా రాస్తావు,నీవు ఏమనుకుంటున్నావు,నీ ఇష్టం వచ్చినట్టు వార్త రాస్తావా అంటూ నానా దుర్భాషలాడి,"రిపోర్టర్ సెల్ ఫోన్ లాక్కోండి" అని అక్కడే ఉన్న తన సిబ్బందికి డాక్టర్ పురమాయించి తన సెల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించి దాడి కి యత్నించింది.ఈ విషయాన్ని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు తెలపాలని ఫోన్ చేస్తే,ఆర్ఎం స్పందించలేదు. జర్నలిస్టును అవమానపరిచిన డాక్టర్ క్షమాపణ చెప్పాలని, ఆమె పై తగిన చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ఆందోళన నిర్వహిస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించారు.